.

8, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రైవేటు సంస్థల్లో చేరే 'బొగ్గు' అధికారులపై దర్యాప్తు



- పార్లమెంటరీ స్థాయీసంఘం సూచన
    న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు ప్రైవేటు మైనింగ్‌ సంస్థల్లో చేరుతుండటంపై బొగ్గు మంత్రిత్వశాఖకుచెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నుండి రిటైరయిన తరువాత ప్రైవేటు సంస్థల్లో చేరటం చట్టనిబంధనలకు విరుద్ధమైనందున ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. బొగ్గు క్షేత్రాలకేటాయింపులో ప్రమేయం వున్న బొగ్గు మంత్రిత్వశాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అధికారులు పదవీ విరమణ చేసిన తరువాత ప్రైవేటు మైనింగ్‌ సంస్థల్లో చేరుతుండటం అనేక అనుమానాలకు తావిస్తుండటంతో తాము ఈ సూచన చేస్తున్నట్లు కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి