8, ఫిబ్రవరి 2014, శనివారం

టైంపాస్‌.. పైసా( రివ్యూ)
   బతకడం కోసం డబ్బు అవసరం. అది ఆశ అయితే ఫరవాలేదు. దురాశ అయితేనే దుస్సంఘటనలు జరుగుతాయి. కుటుంబ పోషణకు తాపత్రయపడే వ్యక్తి, మరొకరు కుటుంబ పరువు కోసం పాకులాడే మనిషి, రాజకీయనాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశావహుడు..ఇలా మూడు రకాల వ్యక్తుల జీవితంలో డబ్బు ఎటువంటి మార్పు తెచ్చింది అన్నదే 'పైసా' చిత్ర కథ. మురారి, చందమామ, ఖడ్గం, మహాత్మ..మొదలైన చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు అందుకున్న కృష్ణవంశీకి విజయం తప్పనిసరి అన్న పరిస్థితిలో చేపట్టిన ప్రాజక్ట్‌ 'పైసా'. చివరి సారి తీసిన 'మొగుడు' చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది. 'చక్రం' వంటి కథతో ప్రభాస్‌లో కొత్త జీవితకోణాల్ని ఆవిష్కరించి ప్రేక్షకుల హృదయాల్ని టచ్‌ చేశాడు. తనకంటూ ప్రత్యేక ముద్రను ఆపాదించుకున్న ఆయన ఈసారి కొత్త పాయింట్‌ను ఎన్నుకోవడం విశేషం. అప్పటికే డబ్బు చుట్టూ చాలా కథలు తిరిగినా.. ఓల్డ్‌సిటీ నేపథ్యంలో అధికభాగం తెరకెక్కిన చిత్రం కావడం ఇందులో ప్రత్యేకత. హైదరాబాద్‌ బేస్డ్‌ నటీనటులతో రూపొందిన అంగ్రేజ్‌, హైదరాబాద్‌నవాబ్స్‌ వంటి టైంపాస్‌ చిత్రాల తరహాలోనే ఈసారి కృష్ణవంశీ వెళ్ళడం కొసమెరుపు. 
అయితే దాన్ని ఎలా చెప్పాడో చూద్దాం...read more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి