8, ఫిబ్రవరి 2014, శనివారం

క్యాబినెట్‌ ఆమోదం.. టి వేగం- టి. బిల్లు మరో కీలకఘట్టం 
- 30కి పైగా సవరణలు 
- ప్యాకేజీ వూరింపులు, యుటికి ససేమిరా 
- బిజెపికీ సమ్మతి 
- 12న రాజ్యసభకు 
- అసెంబ్లీకి పంపిన బిల్లే పార్లమెంటుకు
- అధికారికంగా సవరణల జాబితా 
- అసెంబ్లీ స్థానాల పెంపు 
- పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రకు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర విభజన దిశలో కేంద్రం మరో కీలకమైన ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఈ సమావేశంలో సీమాంధ్ర కేంధ్ర మంత్రులు నిరసనలకే పరిమితమైనారు.వారు ప్రతిపాదించిన సవరణలను కేబినెట్‌ పెద్దగా పట్టించుకోలేదు. కేబినెట్‌ భేటీ ముగిసిన వెంటనే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలోనూ బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే, గతంలో ప్రకటించిన విధంగా ఈ నెల 10న కాకుండా 12వ తేదిన రాజ్యసభలో ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించారు. కోర్‌ కమిటీ సమావేశం ముగిసిన తరువాత ఎఐసిసి నేత అహ్యద్‌ పటేల్‌ ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. అయితే, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి