8, ఫిబ్రవరి 2014, శనివారం

వెలుగు చూసిన నందిగ్రామ్ నిజాలు    మావోయిస్టుల నుంచి మితవాదుల పక్షాన ఉన్న మతోన్మాద శక్తుల వరకూ అందరూ ఈ విషయంలో ఏకమయ్యారు. ప్రతిపక్షానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వం వహించింది. దాంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. దాంతో ఆమె వామపక్ష వ్యతిరేక శక్తులకు ఒక చిహ్నంగా ఇటు జాతీయంగానే కాకుండా అటు అంతర్జాతీయంగా కూడా ఆవిర్భవించారు. అక్కడ నుంచి వామపక్షాలను ఎన్నికలపరంగా అజేయంగా ఎదుర్కొనడానికి రంగం సిద్ధమైంది. ఆ రకంగా ఆమె టైమ్‌ మేగజైన్‌ కవర్‌పేజీకి కూడా ఎక్కారు.
    చరిత్ర చాలా క్రూరమైనది. ఒక్కోసారి అది వాస్తవాన్ని కూడా బంధించేస్తుంది. ఏడేళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఒక మారుమూల గ్రామమైన నందిగ్రామ్‌ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోయింది. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి