3, ఫిబ్రవరి 2014, సోమవారం

ఏప్రిల్‌ నుంచి 'ఉపాధి' కూలి పెంపు : జైరాం
న్యూఢిల్లీ, ఆదిలాబాద్‌ ప్రతినిధి : ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏప్రిల్‌ 1 నుంచి ఉపాధి కూలి పెంచుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌ తెలిపారు. ఈ పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన తొమ్మిదో జాతీయ 'ఉపాధి' దినోత్సవ కార్యమ్రానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి కూలిని వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ)తో ముడిపెట్టామని, ప్రతి సంవత్సరమూ దీన్ని పున:పరిశీలిస్తున్నామని తెలిపారు.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి