1, ఫిబ్రవరి 2014, శనివారం

తెలుగు కథకు చిరునామా 'చాసో'


- తెలకపల్లి రవి
ప్రజాశక్తి-హైదరాబాద్‌ ప్రతినిధి
   తెలుగు కథకు చిరునామా చాసో అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి చెప్పారు. సాహితీ స్రవంతి నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కథా రచయిత ''చాసో'' శతజయంతి సభ, జనకవనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి నగర కమిటీ అధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం గురించి మాట్లాడాలంటే అందులో చాసో గురించి మాట్లాడకుండా ఉండలేమన్నారు. కవిగా కవిత్వంలో నుండి కథల్లోకి వచ్చారని చెప్పారు. కథకు, సాహిత్యానికి ఆయన గొప్ప ఒరవడి అని కొనియాడారు. తెలుగునాట ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తిత్వం ఆయనదన్నారు. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి