.

8, ఫిబ్రవరి 2014, శనివారం

ఆంధ్రా బ్యాంకు లాభాల్లో భారీ పతనం



- క్యూ3లో రూ.46 కోట్లకు క్షీణత 
- మొండి బాకీల ఎఫెక్ట్‌
   ప్రజాశక్తి-బిజినెస్‌ బ్యూరో
  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఆంధ్రా బ్యాంకు లాభాలకు మొండి బాకీలు గండి కొట్టాయి. నిరర్థక ఆస్తులు పేరుకుపోవడంతో క్రితం త్రైమాసికంలో బ్యాంకు నికర లాభాలు ఏకంగా రూ.46 కోట్లకు తగ్గాయి. 2012-13 ఇదే త్రైమాసికంలో రూ.257 కోట్ల లాభాలు సాధించింది. ఆంధ్రా బ్యాంకు గత క్యూ3 ఆర్థిక ఫలితాలను గురువారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. గత డిసెంబర్‌ ముగింపు నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) రూ.5,692 కోట్లకు ఎగిసి 5.55 శాతానికి చేరాయి. see more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి