18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఎన్నికల చిత్తంబరం         ఆర్థిక మంత్రి చిదంబరం ఆఖరి అనామతు పద్దులో అనుకున్నంత పని చేశాడు. అంతా బావున్నట్టు చెబుతూనే అనేక భారాలకు ద్వారాలు తెరిచాడు. ఉత్పత్తి రంగం వృద్ధి గొప్పలు ఉత్తుత్తివని తేలిపోగా వ్యవ'సాయం' మిథ్యగా మిగిల్చాడు. చెప్పిన అంచనాలకన్నా ప్రణాళికా కేటాయింపు అమాంతం 66 వేల కోట్లు కత్తెర వేశాడు. కేంద్ర ప్రణాళికకూ వివిధ రాష్ట్రాలకూ ఇచ్చే సహాయం మొత్తం 80 వేల కోట్లకు పైగా తెగ్గోశాడు. అవసరాలకు బిగబట్టి ద్రవ్యలోటు తగ్గించినట్టు మురిపించాడు. పరిశ్రమలకూ బడా బాబులకు రాయితీలు కొనసాగించడమే గాక సామాన్య ప్రజలకు ఉపయోగపడే సహాయమొత్తాలను మాత్రం వున్నచోటనే వుంచేసి ఉత్త మాటలు వడ్దించాడు. విద్య వైద్యం ఉపాధి ఉత్పత్తి వంటివాటికి వూపునిచ్చేవి గాక సరళీకరణ తంత్రాలనే పునరావృతం చేసి ఎన్నికల తర్వాత మరిన్ని వడ్డింపులకు రంగం సిద్ధం చేశాడు. see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి