18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఢిల్లీ-అటిన్షన్-హైదరాబాద్        ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లుపై కదలికలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం చకచకా పావులు కదిపింది.బిల్లుపై చర్చ ప్రారంభించడమే గాక ఓటింగు కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. బిజెపి కూడా సహకరించే ధోరణిలో వుందంటున్నారు. ఆ పార్టీ నేతలతో స్వయంగా సోనియా గాంధీ ఈ విషయం ప్రస్తావించడం, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ మంతనాలు జరపడం, కొన్ని సవరణలపై కె.సి.ఆర్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారన్న కథనాలు ఆసక్తి కలిగించాయి. చర్చలో పాల్గొని సూచనలు చేయాలన్న రాహుల్‌ సలహా పనిచేసినట్టే కనిపించింది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయమై కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. దేశ రాజధానిలో ఏపీ ఎన్జీవోల ధర్నా, వైఎస్సార్‌సీపీ దీక్షలు, కాంగ్రెస్‌ టిడిపి సీమాంధ్ర నేతల నిరసనలు జరిగినా కేంద్రం మాత్రం అనుకున్న దిశగా అడుగులు వేస్తున్నది. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి