.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఢిల్లీలో నేతల సందడి



- హోంశాఖకు చేరిన నివేదిక
- నేడు రాష్ట్రపతికి 
- రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్రపతితో బాబు భేటీ
- బిజెపి తీరుపై అనుమానాలు
- సిపిఐ సంపూర్ణ మద్దతు 
- కొనసాగతున్న కెసిఆర్‌ మంతనాలు
- నేడు కాంగ్రెస్‌ వార్‌రూం భేటీ
- ఇరు ప్రాంత ఎంపీలతో పాటు సిఎంకు ఆహ్వానం
- ఆ ఆరుగురిపై వేటుకు నిర్ణయం?
  ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
  రాష్ట్ర విభజన వేడి ఢిల్లీకి తాకింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కేంద్రంగానే సోమవారం నాడు ఢిల్లీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి నుండి బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చల వివరాలతో కూడిన నివేదిక హోంశాఖకు చేరింది. దీనిని అధ్యయనం చేసి, అవసరమైన వివరాలతో రాష్ట్రపతికి, జిఓఎంకు అందివ్వడానికి హోంశాఖ సన్నాహాలు ప్రారంభించింది. మంగళవారం ఈ నివేదిక రాష్ట్రపతికి అందనుందని సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఒకవైపు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మరోవైపు వివిధ పార్టీల నేతలతో భేటీల పరంపర కొనసాగిస్తున్నారు. విభజన బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా వారు తమ వాదనను వినిపిస్తున్నారు. see more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి