1, ఫిబ్రవరి 2014, శనివారం

నన్ను మాట్లాడకుండా చేశారు


- చర్చ ముగింపుపై చంద్రబాబు ఆరోపణ
- టెన్‌జనపథ్‌ స్క్రిప్టు... సిఎం,స్పీకర్‌ పాత్రదారులు 
- విభజన చేస్తున్న విధానమే తప్పు
- రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేస్తాం 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
   రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో తనను మాట్లాడకుండా చేశారని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో మాట్లాడించే బాధ్యత స్పీకర్‌కు, ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. విభజన తప్పుకాదు...చేసే విధానమే తప్పు అన్నారు. బిల్లుపై మాట్లాడుతానని స్పీకర్‌ను మూడు, నాలుగుసార్లు అడిగినా ఆయన తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు.  read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి