2, ఫిబ్రవరి 2014, ఆదివారం

బెదిరింపులకు త‌ల‌వంచ‌ని క్యూ‌బా         అనేకానేక కుట్రలు, కుతంత్రాలు పన్ని క్యూబాను అస్థిరపరచాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాటినన్నింటినీ తట్టుకుని క్యూబా సగర్వంగా, ధీటుగా తల ఎత్తుకుని నిలబడింది. ఈ 55 ఏళ్ళ కాలంలో 11 అమెరికా ప్రభుత్వాలు పన్నిన నీచపూరితమైన కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా క్యూబా ప్రజలు నిరంతరంగా, అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా క్యూబా విప్లవం సాధించిన లక్ష్యాలను భగం చేయలేకపోయారు. విప్లవం సాధించిన ఆర్థిక, సామాజిక వ్యవస్థను మార్చలేకపోయారు. మన మాతృభూమిపై సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని పునరుద్ధరించలేకపోయారు.
     యాభై ఐదు ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈనాడు ఇక్కడ ఇలా ఉంటామని ఆనాడు మనలో ఏ ఒక్కరూ కలగని ఉండరు. ఇంతటి సుదీర్ఘమైన, కష్టాలు, కడగండ్లతో కూడిన ఈ ప్రయాణంలో ఏదీ అంత తేలికగా మన చేతికి రాలేదు. ఇప్పుడున్న వాటిని సాధించడం వెనుక గల మొదటి కారణం అనేక తరాల పాటు ప్రజలు అకుంఠిత దీక్షతో, కఠోర చిత్తంతో సాగించిన ప్రతిఘటనా ..see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి