5, ఫిబ్రవరి 2014, బుధవారం

సిలిండర్లు సరెండర్‌ చేయండి


- కనెక్షన్ల కుదింపునకు ఆయిల్‌ కంపెనీల కొత్త ఎత్తుగడ 
- ఆధార్‌ లేకపోతే బ్లాక్‌లిస్ట్‌
  ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
  గ్యాస్‌ వినియోగదారుల్ని నిండా ముంచేందుకు ఆయిల్‌ కంపెనీలు మరో ఎత్తుగడకు తెరతీసాయి. ఇప్పటి వరకు ఆధార్‌ నెంబర్‌ను బ్యాంక్‌ అక్కౌంట్‌కు అనుసంధానం చేయని కనెక్షన్లను సరెండర్‌ చేసుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు ఇచ్చాయి! డబుల్‌ కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్‌ను సరెండర్‌ చేస్తేనే గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తామని మరో నిబంధననూ దీనికి జోడించాయి. ఇప్పటి వరకు ఉన్న వినియోగదారుల పేర్ల మార్పు, డిస్ట్రిబ్యూటర్ల స్వేచ్ఛా ఎంపిక వంటి సేవలకు స్వస్తి పలికాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు యుపిఏ-2 ప్రభుత్వం నగదు బదిలీని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కనెక్షన్ల సంఖ్యను తగ్గించుకొనేందుకు ఆయిల్‌ కంపెనీలు ఈ తరహా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఒకే పేరుమీద వేర్వేరు కంపెనీల్లో రెండు, అంతకన్నా ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాటిని తక్షణం సరెండర్‌ చేయాల్సిందేనంటూ 15 రోజుల క్రితమే హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పాత పద్ధతిలోనే గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు ఆయిల్‌ కంపెనీలు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ఏజెన్సీల్లో బ్లాక్‌ లిస్ట్‌ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడుతున్నారు.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి