.

1, ఫిబ్రవరి 2014, శనివారం

ఇక చకచకా..


- నేటి సాయంత్రం సిఎస్‌కు
- ఆదివారం రాష్ట్రపతికి 
- కోర్‌కమిటీలో ప్రస్తావన
- హైదరాబాద్‌కు వచ్చిన 
హోంశాఖ ప్రత్యేక అధికారి
- డిజిపికి ఢిల్లీ పిలుపు 
- విమానాశ్రయంలో దిగ్విజరుసింగ్‌తో 
కాంగ్రెస్‌ నేతల భేటీ
- సిఎంపై వ్యూహాత్మక విమర్శలు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
రాష్ట్ర విభజన దిశలో కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సాధ్యమైనంత త్వరగా రాష్ట్రపతికి చేర్చడానికి సన్నాహాలు ప్రారంభించింది. శాసనసభలో చర్చ పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఈ విషయంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. శాసనసభ కార్యాలయానికి చర్చల వివరాలు పంపాల్సిన తీరుపై సూచనలు జారీ చేశారు. చర్చల పూర్తివివరాలతో పాటు, రాతపూర్వంకగా సభ్యులు ఇచ్చిన అభిప్రాయాలను, క్లాజులపై ఇచ్చిన సవరణలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి 50సెట్లను ఢిల్లీకి పంపాలని కేంద్ర హోంశాఖ సూచించడంతో శాసనసభ అధికారులు ఆ దిశలో సన్నాహాలు చేపట్టారు. read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి