.

31, జనవరి 2014, శుక్రవారం

అభిప్రాయాల క్రోడీకరణ - ఆసాంతం తిర‌స్క‌ర‌ణ‌



ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
    ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఒక అంకానికి తెరపడింది. ఉభయసభల్లోనూ బిల్లుపై చర్చను ముగించారు. చర్చలో సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పాటు రాతపూర్వంకగా సమర్పించిన వివరాలను, సవరణల ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపుతున్నట్లు ఉభయసభాపతులు ప్రకటించారు. తప్పుల తడకగా ఉన్న రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదంటూ ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి 77వ నిబంధన కింద ప్రతిపాదించిన తీర్మానాన్ని టి. సభ్యుల తీవ్ర నిరసనల మధ్య శాసనసభ ఆమోదించింది. మండలిలో సభ నాయకుడు రామచంద్రయ్య ప్రతిపాదించిన ఇదే తీర్మానానికి ఆమోద ముద్ర పడింది. మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, శాసనమండలిలో ఛైర్మన్‌ ఏ. చక్రపాణి ప్రకటించారు. ఆ వెంటనే ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాయిదా ప్రకటన వెలువడిన వెంటనే ఉభయసభల్లోనూ తెలంగాణా, సమైక్యాంధ్ర నినాదాలు మారుమ్రోగాయి.
 see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి