25, జనవరి 2014, శనివారం

రాన్‌బాక్సీకి మరో ఎదురుదెబ్బ
- టోన్సా ప్లాంట్‌ ఔషధాలపై నిషేధం 
- అమెరికా నిర్ణయం అ షేర్‌ 19% పతనం
  న్యూఢిల్లీ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ రాన్‌బాక్సీకి అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్‌లోని ఆ కంపెనీ టోన్సా ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఆక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రెడీయేంట్స్‌ (ఎపిఐ) ముడి సరుకుల దిగుమతులపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యుఎస్‌ఎఫ్‌డిఎ) గురువారం నిషేధం ప్రకటించింది. ఈ ప్రకటనతో బిఎస్‌ఇలో రాన్‌బాక్సీ షేర్‌ విలువ ఏకంగా 19.33 శాతం పతనమై రూ.336.50కు దిగజారింది.
ఎఫ్‌డిఎ నిబంధనలకు విరుద్దంగా ఆ కంపెనీ ఇంజక్షన్లు కొన్ని ఇతర ఉత్పత్తులు 2012 జనవరిలో తమ మార్కెట్లోకి విడుదలయ్యాయని అమెరికా ఎఫ్‌డిఎ ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ ఎపిఎ ఉత్పత్తుల సరఫరాను నిషేదిస్తున్నట్లు తెలిపింది.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి