25, జనవరి 2014, శనివారం

తొలి విజయం
- మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్టోక్స్‌ 
- రాణించిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ 
- 57 పరుగుల తేడాతో విజయం 
   పెర్త్‌: యాషెస్‌లో 5-0 పరాభావం, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో 3-0తో వెనుకబడ్డ ఇంగ్లాండ్‌ జట్టు ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. టెస్టు, వన్డేలతో కలిపి వరుసగా 8 ఓటముల తరువాత ఇంగ్లాండ్‌ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అందరూ సమిష్టిగా రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు 316 పరుగుల భారీ స్కొరు సాధించింది. ఇంగ్లాండ్‌ జట్టులో అత్యధికంగా స్టోక్స్‌ ( 70, 81బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) రాణించాడు, అతనికి తోడుగా మిడిల్‌ ఆర్డర్‌లో బట్లర్‌ (71, 43బంతుల్లో 6ఫోర్లు, 4సిక్స్‌) చెలరేగడంతో ఇంగ్లాండ్‌ నాలుగో వన్డేలో విజయం సాధించింది. read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి