.

29, జనవరి 2014, బుధవారం

ఆరుస్థానాలకు 9మంది



-  ముగిసిన రాజ్యసభ నామినేషన్ల పర్వం
-  టిఆర్‌ఎస్‌కు సిపిఐ మద్దతు
     ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      రాజ్యసభకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని ఆరు స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌తోపాటు టిడిపి, టిఆర్‌ఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు కూడా మంగళవారం నాడే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో శాసనసభ కార్యదర్శి కార్యాలయం వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తరపున ముగ్గురు, టిడిపి తరపున ఇద్దరు, టిఆర్‌ఎస్‌ తరపున ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శి సదారాంకు తమ నామినేషన్‌ ఫారాలను వీరు అందచేశారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కె. కేశవరావుకు సిపిఐ మద్దతు ప్రకటించింది. కెకె నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ఏలు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా జెసి దివాకర్‌రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే, చివరి క్షణంలో ఆయన తప్పుకున్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెడ్డి ఆయన స్థానంలో నావినేషన్‌ వేశారు మరో స్వతంత్ర అభ్యర్థిగా చైతన్య రాజు నామినేషన్‌ దాఖలు చేశారు.శ్రమజీవి పార్టీకి చెందిన జె.భాస్కర్‌ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి