.

10, జనవరి 2014, శుక్రవారం

ఆ రూ.19వేల కోట్లు ఎక్కడివి?


-  సహారాను ప్రశ్నించిన సుప్రీం 

-  సిబిఐ విచారణకు ఆదేశిస్తామని హెచ్చరిక
   న్యూఢిల్లీ : తమ ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించామని చెబుతున్న రూ.19వేల కోట్లకు ఆదాయ వనరులు ఏమిటని సుప్రీం కోర్టు గురువారం రెండు సహారా కంపెనీలను ప్రశ్నించింది. ఈ డబ్బుకు సంబంధించిన వివరాలు చెప్పలేకపోయినట్లైతే తాము దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తామని సుప్రీం కోర్టు సహారాను హెచ్చరించింది. సహారా గ్రూప్‌ కింద రిజిస్టర్‌ అయిన రెండు కంపెనీలు కూడా ప్రతి ఒక్క రూపాయికి వివరణ చెప్పాలని కోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో అంత పెద్ద మొత్తంలో డబ్బుకు ఆదాయ వనరులు కనిపెట్టడం కష్టమవుతుందని చెప్పారు. ఈ నెల 23కల్లా ఈ వివరాలు సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ విషయంలో తాము విఫలమైనట్లైతే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌, సిబిఐని పిలిపించి దర్యాప్తు చేయాల్సిందిగా కోరతామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.  red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి