.

18, డిసెంబర్ 2013, బుధవారం

నేటి నుంచి చర్చ


-   20 వరకు అసెంబ్లీ
-    బిఏసిలో నిర్ణయం
-    చంద్రబాబు గైర్హాజరు 
-    వైసిపి, సీమాంధ్ర టిడిపి సభ్యుల వాకౌట్‌ 
     ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
    రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ ముసాయిదా బిల్లుపై నేటి (బుధవారం)నుంచి శాసనసభలో చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల కమిటి (బిఏసి) సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం వరకు సమావేశాలు నడుస్తాయి. అంటే ఈ నెల 20 వరకు బిల్లుపై చర్చ నడుస్తుంది. ప్రశ్నోత్తరాలు యధా విదిగానే ఉంటాయి. క్రిస్మస్‌పండుగ సెలవులు, ఇతర సెలవుల అనంతరం తదుపరి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను బుధవారం శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించనున్నారు. ఈ నెల 30 నుంచా లేదా జనవరి మొదటి వారంలో తిరిగి సమావేశాలు ప్రారంభ మయ్యే అవకాశాలున్నట్లు అసెంబ్లీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ చీప్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. గందరగోళాలు, ఉత్కంఠ మధ్య సోమవారం అసెంబ్లీలో బిల్లును టేబుల్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే బిఎసి జరగకుండానే సోమవారం సాయంత్రం చర్చ ప్రారంభమైందని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి