.

18, డిసెంబర్ 2013, బుధవారం

రెండో దశకు అనుమతి


-   వంశధారపై ట్రిబ్యునల్‌ మధ్యంతర తీర్పులో వెల్లడి
-    నేరడి బ్యారేజీపై విచారణ కొనసాగింపు
-    పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
     ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో/శ్రీకాకుళం ప్రతినిధి
    వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 నిర్మాణానికి వంశధార నదీ జల వివాదాల ట్రిబ్యునల్‌ అనుమతినిచ్చింది. వంశధార నదిపై ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించదలచిన సైడ్‌ ఛానల్‌ నిర్మాణం సబబేనని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. నదీ జలాల్లో 8 టిఎంసిల నీటిని వాడుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు ఎంకె శర్మ నేతృత్వంలోని త్రిసభ్య ట్రిబ్యునల్‌ మంగళవారం తీర్పును వెల్లడించింది. తదుపరి ఉత్వర్వులు వెలువడే వరకూ ఈ తీర్పు అమల్లో ఉంటుందని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ గ్రామం వద్ద వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2 స్టేజ్‌-2 లో భాగంగా సైడ్‌ ఛానల్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంపై ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ప్రాజెక్టు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నట్లు ట్రిబ్యునల్‌ తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రాజెక్టు అక్రమం, చట్టవిరుద్ధమని ఒరిస్సా ప్రభుత్వం రుజువు చేయలేకపోయిందని see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి