.

26, డిసెంబర్ 2013, గురువారం

ఊపు తక్కువ 'ఉయ్యాలా జంపాలా'(రివ్యూ)

     ఒక కథతో ఓ సినిమా వచ్చి సూపర్‌హిట్టయ్యాక, దాదాపు అలాంటి కథతోనే కొద్దిగా నేపథ్యం మార్చి మరో సినిమా వస్తే? ఇలాంటి సంఘటనలు తెలుగు సినిమాకు కొత్త కాదు. వినూత్నమైన ప్రచారంతో, కొత్త హీరో హీరోయిన్లతో అందరినీ ఆకర్షిస్తూ, తాజాగా వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' పరిస్థితి కూడా అచ్చంగా అదే!     ఇది ఓ ప్రేమ కథ. గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. వివరంగా చెప్పాలంటే... గోదావరి జిల్లాల్లోని పచ్చని పంట పొలాలు, చెరువుల నేపథ్యంలోని కూనవరం గ్రామం. ఆ గ్రామంలో సూరి (తొలి పరిచయం రాజ్‌ తరుణ్‌) తండ్రి లేని బిడ్డ. పెద్ద చదువులు చదువుకోని సూరి కోడి పెంటతో చేపల చెరువుకు మేత అందించే వ్యాపారం చేస్తుంటాడు. తల్లిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మరో ఇల్లు అతని అమ్మమ్మ, తాతయ్య, మేనమామలది. ఆ మేనమామకు ఓ కూతురు. ఆ మరదలు పేరు ఉమాదేవి (తెలుగులో 'చిన్నారి పెళ్ళికూతురు'గా అనువాదమైన హిందీ సీరియల్‌ 'బాలికా వధు' ఫేమ్‌ అయిన అవికా గోరే). బావామరదళ్ళు ఎప్పుడూ ఏవో గిల్లి కజ్జాలు, కొట్లాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు.see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి