.

26, డిసెంబర్ 2013, గురువారం

అమృతహస్తం - అస్తంవ్యస్తం

ప్రస్తుత ధరలను విశ్లేషిస్తే మెనూ ప్రకారం వండి పెట్టటానికి రూ.31 ఖర్చు నిర్వాహకులకు అవుతుంటే పాలకులు కేవలం రూ.15 ఇస్తున్నారు. అంటే రోజుకు ఒక్కొక్కరికి రూ.16 అదనపు భారం నిర్వాహకులపై మోపుతోంది. దీంతో నిర్వాహకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించటం వల్ల అమృత హస్తం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పౌష్ఠికాహిరం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత హస్తం పథకం ప్రసవవేదన పడుతోంది. పాలకులకు ప్రచారంపై ఉన్న మమకారం అమలుపై లేకపోవటంతో అస్తవ్యస్తంగా మారింది. పౌష్టికాహారం దొరుకుతుందని ఆశతో అంగన్‌వాడి కేంద్రానికి వచ్చిన బాలింతలు, గర్భిణీలకు నిరాశే మిగులుతోంది. ఇందిరమ్మ అమృత హస్తం పథకంలోని అమృతం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారి మొండిహస్తమే దర్శనమిస్తోంది. కాంగ్రెసు పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి గాని ఆచరణలో నైరాశ్యం అలుముకుంది. వన్‌ ఫుల్‌ మీల్స్‌ నినాదంతో ప్రభుత్వం ఊదరగొడుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం,ధరల శాపంతో పథకం అమల్లో అష్టకష్టాలు పడుతోంది. పని భారంతో అంగన్‌వాడీలు తల్లడిల్లుతున్నా, అప్పుల భారంతో గ్రామ సమాఖ్యలు హాహాకారాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టటం లేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడితేనే సరిపోదు, వాటి ఫలితాలు లబ్ధిదారులకు చేరినప్పుడే సార్థకత ఉంటుంది. కానీ పాలకులకు ఆ దృష్టి లేదు. రాష్ట్ర ప్రభుత్వం see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి