.

27, డిసెంబర్ 2013, శుక్రవారం

మే 17న ఎంసెట్‌

- ప్రవేశపరీక్షల తేదీల ప్రకటన
-ఎన్నికల తేదీలకు అడ్డొస్తే మార్పులు
-ఉన్నత విద్యామండలి వెల్లడి
 

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎంసెట్‌) -2014 పరీక్షను వచ్చే సంవత్సరం మే 17న జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి పదిన నోటిఫికేషన్‌, జూన్‌ రెండున ఫలితాలు విడుదల కానున్నాయి. గురు వారం ఉన్నతవిద్యామండలిలో జరిగిన సమావేశంలో ప్రవేశపరీక్షల తేదీలను ఉన్నతవిద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు కేటాయించిన యూనివర్సిటీల వైస్‌ఛాన్సలర్లు, కన్వీనర్లతో మండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, సెక్రటరీ సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజరుజైన్‌, ఉన్నతవిద్యముఖ్య కార్యదర్శి అజరుమిశ్రా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పరీక్షల తేదీలను ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గతంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన యూనివర్సిటీలకే 2014-15 పరీక్షల బాధ్యతలను అప్పగించామన్నారు. సారత్రిక ఎన్నికలకు సంబంధించి మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌ రానుందని, ఒకవేళ పరీక్షల తేదీలు అడ్డుగా ఉంటే తర్వాత వాటిని రీ షెడ్యూల్‌ చేస్తామన్నారు. read more 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి