.

4, డిసెంబర్ 2013, బుధవారం

నువ్వు నా..ముందుంటే..

శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్‌ పిక్చల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'గలాట'. కృష్ణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో జరిగిన తాజా షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ..
'వినోదమే ప్రదానంగా తెరకెక్కుతోన్న ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రంలో కృష్ణ నటించిన 'గూఢచారి 116'లో కృష్ణ, జయలలితపై చిత్రించిన 'నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..' అనే పాటను మా చిత్రంలో యథాతథంగా హీరోహీరోయిన్లపై స్వర్ణ నృత్యదర్శకత్వంలో చిత్రీకరించాం. జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
  దర్శకుడు మాట్లాడుతూ.. 'పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే నవ్యమైన పాయింట్‌తో తెరకెక్కుతోంది' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కెమెరా: ఫిరోజ్‌ ఖాన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి