.

7, డిసెంబర్ 2013, శనివారం

నింగికేగిన 'శాంతి కపోతం'

-   ఓ శాంతి కపోతం శాశ్వతంగా రెక్క వాల్చింది..
 - ప్రపంచానికి దారి చూపిన కాంతిపుంజం కనుమరుగైంది..
- వివక్షను రూపుమాపిన స్వేచ్ఛా గీతం మూగబోయింది..  

 మనుషులంతా ఒక్కటేనని, వర్ణ వైరం అన్యాయమని, జాతి వివక్షకు ఎదురొడ్డిన స్వేచ్ఛా పిపాసి, నల్లజాతి సూరీడు నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా కన్నుమూశారు. 96 ఏళ్ల జీవితంలో ఐదు దశాబ్దాల పాటు నల్లజాతీయుల పక్షాన పోరుసల్పిన ధీశాలి ఇక విశ్రమించారు. దక్షిణాఫ్రికా వాసులనే కాకుండా.. విశ్వవ్యాప్తంగా శాంతిని కాంక్షించే వారికి తీరని వ్యధ మిగిల్చి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన వీరోచిత పోరాటాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటే... అడుగడుగునా తెల్లవారి దాష్టీకం... దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రాంతంలో తెంబు వంశానికి చెందిన కుటుంబంలో 1918 జులై 18న మండేలా జన్మించారు. అప్పటికే దక్షణాఫ్రికాను పరిపాలించే బ్రిటిష్‌వారు కేప్‌ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకున్నారు. స్వల్ప సంఖ్యాకులైన తెల్లవారు పాలకులై.. అధిక సంఖ్యాకులు, స్థానికులైన నల్లజాతి ప్రజలమీద పెత్తనం చెలాయించేవారు. దారుణంగా శ్రమదోపిడీకి పాల్పడేవారు. ఏవిధమైన హక్కులూ లేని బానిసల్లా నల్లజాతి ప్రజలను హీనంగా చూసేవారు. వీరి చేతిలో కేవలం 13శాతం భూమి మాత్రమే ఉండేది. జాతీయాదాయంలోనూ వీరికి అత్యల్పంగా 20శాతం కన్నా తక్కువగా వాటా వుండేది. సంపద see more...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి