.

18, డిసెంబర్ 2013, బుధవారం

పునర్వ్యవస్థీకరణ బిల్లు లోని ముఖ్యాంశాలు



హైదరాబాద్ : రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిల్లు ప్రతులు అందాయి. పన్నెండు భాగాలు, 13 షెడ్యూల్స్ తో 64 పేజీల బిల్లు రూపొందింది.
ముఖ్యాంశాలు..
- 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.
- 13 జిల్లాల సీమాంధ్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
- పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
- పదేళ్ల లోపు ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఏర్పాటు.
- కొత్త రాజధానిపై నిపుణుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ 45 రోజుల్లో రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఓ నివేదిక అందించనుంది.
-పదేళ్ల తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్.
- ప్రస్తుత గవర్నరే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కొనసాగింపు.
- గవర్నర్ పరిధిలోనే శాంతి భద్రతలు, రెవెన్యూ, ప్రభుత్వ భవనాలు ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లు, 50 మంది ఎమ్మెల్సీలు.
- తెలంగాణకు 119 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ సీట్లు, 40 మంది ఎమ్మెల్సీలు.see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి