.

30, డిసెంబర్ 2013, సోమవారం

విదేశాల్లో 14 శాఖలు

-  నూతన సర్కిల్‌గా తిరుపతి
-  2014లో 8 వేల ఉద్యోగాల భర్తీ
-  కెనరా బ్యాంకు సిఎండి వెల్లడి
   పూణె : రానున్న రెండేళ్లలో విదేశాల్లో కొత్తగా 14 శాఖలను విస్తరించాలని కెనరా బ్యాంకు నిర్దేశించుకుంది. అదే విధంగా మరో రెండు, మూడేళ్ళలో విదేశాల నుంచి వచ్చే రెవెన్యూ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకు వ్యాపారంలో ప్రస్తుతం ఈ వాటా ఆరు శాతంగా ఉంది.
ప్రస్తుతం ఈ బ్యాంకుకు విదేశాల్లోని మూడు ప్రాంతాల్లో ఐదు శాఖలున్నాయి. మరో మూడు నెలల్లో జోహెన్నస్‌బర్గ్‌లో కొత్త శాఖను తెరువనుంది. అదే విధంగా సెప్టెంబర్‌ 2014 నాటికి న్యూయార్క్‌, దుబయి, ఫ్రాంక్‌ఫర్ట్‌లో నూతన శాఖలను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకుంది. మరో పది శాఖలను సాహో పాలూ, దారు ఈ సాలీమ్‌, టోక్కో, అబూజా, జెడ్డా, ఖాతర్‌, సిడ్నీ, ఒంటారియో, వెల్లింగ్టన్‌, సింగపూర్‌ ప్రాంతాల్లో విస్తరించడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఆ బ్యాంకు ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌కె దుబే తెలిపారు. ఈ శాఖలన్నీ నిర్వహణలోకి వస్తే విదేశీ వ్యాపారం 15నుంచి 20 శాతం వాటాకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. శనివారం పూణె సర్కీల్‌లో ఈ-లాంజ్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి