.

2, మార్చి 2011, బుధవారం

రాత్రికి రాత్రే తేల్చలేం

సున్నితము, సంక్లిష్టమైన ప్రత్యేక తెలంగాణా సమస్యను రాత్రికి రాత్రి పరిష్కరించడం సాధ్యమవ్వదని కేంద్ర హోం మంత్రి పి చిదంబరం అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసంతో ఓపిక పట్టాలని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కేంద్రం పరిశీలిస్తోందని, నివేదికపై అఖిలపక్ష భేటీ ఎప్పుడు ఏర్పాటు చేసేదీ మాత్రం తాను చెప్పలేనన్నారు. హోం శాఖ ఫిబ్రవరి మాసం కార్యకలాపాలను వివరించడం కోసం చిదంబరం సోమవారమిక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణా, అఖిలపక్ష భేటీపై విలేకరులడిగిన ప్రశ్నలపై తొలుత ఆయన అసహనం ప్రదర్శించారు. ముక్తసరిగా సమాధానమిచ్చారు. ' తెలంగాణాలో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు, పార్టీలకు మీరు చేసే విజ్ఞప్తి ఏమిటి ? ' అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సుదీర్ఘ సమాధానమిచ్చారు. '' శాంతి, సాధారణ పరిస్థితులను కాపాడాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి