.

3, జనవరి 2011, సోమవారం

పార్టీ అధ్యక్షులనే పిలవాలనొచ్చు కదా!

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి పార్టీ అధ్యక్షులనే ఆహ్వానించాలని కేంద్రానికి లేఖ రాస్తే సముచితంగా ఉండేదని, ఒక్కో పార్టీ తరపున ఒక్కరిని పిలిస్తేనే వస్తామని లేఖ రాయడంలో అంతర్యమేమిటని టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు చంద్రశేఖర రావును టిడిపి అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సమావేశానికి పార్టీ అధ్యక్ష హోదాలో సోనియా గాంధీ వస్తే, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా వస్తారని స్పష్టం చేశారు. సోనియా చెప్పింది వినడం, ఆమె చెప్పులు మోయడమే తప్ప ఇప్పటి వరకూ కెసిఆర్‌ సాధించిందేమీలేదన్నారు. ఆదివారం టిడిఎల్‌పి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ బద్ధంగా సహకరిస్తామని 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తాము చెప్పామని అన్నారు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ వచ్చిందని చెప్పిన కెసిఆర్‌ ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఎందుకు చేయించారని ప్రశ్నించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి