.

4, జనవరి 2011, మంగళవారం

అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు

అకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందుకు జిల్లాల్లో కౌన్సిలింగ్‌ కేంద్రాలు, శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ నెలా కనీసం ఒక సంక్షేమ హాస్టల్‌లో నిద్ర చేసి, అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలు, సహాయ కార్యక్రమాలు, రబీకి ప్రణాళిక, చేనేత కార్మికులు, మత్స్యకారుల సమస్యలపై సోమవారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిపాలన సక్రమంగా ఉంటేనే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు చేరతాయన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి