.

4, జనవరి 2011, మంగళవారం

భారతీయ మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాలి

సామాజిక లక్ష్యాలను నెరవేర్చటంలోనూ, నైతిక, వృత్తిపరమైన విలువలు కాపాడటంలోనూ ఏ మాత్రం కృషి చేస్తున్నామన్న అంశంపై భారతీయ మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వుందని ది హిందూ పత్రిక ప్రధాన సంపాదకుడు ఎన్‌ రామ్‌ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగులోకి వచ్చిన చెల్లింపు వార్తల వ్యవహారం, కార్పొరేట్‌-మీడియా సంస్థల సంబంధాలపై నీరా రాడియా టేప్‌ల వెల్లడి వంటి అంశాలు మీడియా సంస్థలు, వ్యక్తులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేశాయన్నారు. మీడియాకు సంబంధించినంత వరకూ వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో సానుకూల వాతావరణమే వుందని, అయితే ఇటీవలి మీడియా ధోరణులు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి