.
3, జనవరి 2011, సోమవారం
టెక్స్‌టైల్స్‌పై వల్లమాలిన ప్రేమ
చేనేతకు చాలినన్ని నిధులు కేటాయించకుండా ఆ రంగాన్ని నానాటికీ నిర్వీర్యం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం, బహుళజాతి బడా కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న టెక్స్‌టైల్స్ కంపెనీలపై వల్లమాలిన ప్రేమ కురిపిస్తోంది. ఈ పార్కుల కోసం వేల కోట్ల రూపాయలను, వేలాది ఎకరాల భూములను కేటాయిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నప్పటికీ చేనేతరంగం ద్వారా లభించే ఉపాధితో పోలిస్తే టెక్స్‌టైల్ పార్కుల నుండి లభించే ఉపాధి అవకాశాలు చాలా తక్కువ కావటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 30 టెక్స్‌టైల్, అప్పరెల్ పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.9743.75 కోట్లు కేటాయించింది. ఈ పార్కుల ద్వారా 2,20,490 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి చూపించే చేనేతరంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి