.

5, జనవరి 2011, బుధవారం

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుతో... ఎస్‌ఎల్‌బిసి ప్రశ్నార్థకం

'కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడిన' చందంగా జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవ్వక ముందే నిర్దేశించిన నీటి కేటాయింపులు లేకుండా పోయింది. రాష్ట్ర సర్కార్‌ పసలేని వాదనల వల్ల మిగులు జలాలను వినియోగించుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గం ప్రాజెక్టు (ఎస్‌ఎల్‌బిసి) ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా చేపట్టిన నక్కలగండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, పానగల్‌ ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందకుండా పోనుంది. ఇటీవల కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు వల్ల కరువు పీడిత ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లా ఎడారిగా మారే ప్రమాదమేర్పడింది..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి