.

6, జనవరి 2011, గురువారం

స్కాలర్‌షిప్‌ అడిగితే లాఠీఛార్జి

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన పూర్తి వివరాలు... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సమయంలో జెడ్పీలో సర్వసభ్య సమావేశం జరుగుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి