.

2, జనవరి 2011, ఆదివారం

కాలుష్య నియంత్రణకు అంతర్జాల విధానం

కాలుష్య నియంత్రణకు ప్రవేశపెట్టిన అంతర్జాల (ఇంటర్‌నెట్‌) విధానం 'మహా విశాఖ'లోనూ త్వరలో అమలులోకి రానుంది. ఇప్పటికే విశాఖలోని పలు కాలుష్య కారక పరిశ్రమల వల్ల ప్రజలు ఎన్నో రుగ్మతలకు గురవుతున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలపై పరిశ్రమలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ విధానం మెరుగైన ఫలితాలివ్వనుందని ఆ శాఖాధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల ఏడాది పొడవునా ఆయా సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని గుర్తించి, కాలుష్య నియంత్రణను పట్టించుకోని సంస్థలను హెచ్చరించే వీలుంది. అప్పటికీ నియంత్రించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి