.

1, జనవరి 2011, శనివారం

ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని శ్రీకృష్ణ కమిటీ తెలిపింది. రాష్ట్ర పరిస్థితులపై తాము కేంద్రానికి సమర్పించిన నివేదిక పూర్తి నిష్పాక్షికంగా ఉంటుందని, అందరి అభిప్రాయాలను ప్రతిబింబిస్తుందని కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ అన్నారు. సభ్యకార్యదర్శి దుగ్గల్‌, ఇతర సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన ఓ టివి ఛానల్‌తో మాట్లాడారు. ప్రజాభిప్రాయం ఆధారంగా తాము రూపొందించిన నివేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను సంతృప్తి పరుస్తుందని శ్రీకృష్ణ చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి