.

29, డిసెంబర్ 2010, బుధవారం

ఎన్నికలప్పుడే రాజకీయాలు

ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టిసారించాలి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. 'నిజామాబాద్‌ జిల్లాకు నాకు చాలా అనుబంధముంది. నేను క్రికెట్‌ క్రీడాకారుడిగా ఉన్నప్పుడు అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది ఇక్కడే. అందుకే జిల్లాలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను' అని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి