.

29, డిసెంబర్ 2010, బుధవారం

మెజార్టీ ప్రజలను సంతృప్తి పరుస్తాం

' రాష్ట్రంలోని అత్యధిక ప్రజలకు అతి ఎక్కువ సంతృప్తినిచ్చే విధంగా నివేదికను రూపొందించాం ' అని రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. నివేదిక రూపకల్పన పూర్తయిందని ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 31లోపు కేంద్ర హౌం మంత్రికి సమర్పిస్తామని తెలిపారు. నివేదికలోని అంశాలు ఏ విధంగా ఉన్నప్పటికీ హింసకు ఏ ఒక్కరూ తావివ్వరాదని విజ్ఞప్తి చేశారు. తమ నివేదిక శాశ్వత పరిష్కారం చూపుతుందని భావిస్తున్నామన్నారు. కమిటీ సభ్యులు, ఇతర నిపుణులతో కలిసి మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. గడువు పూర్తవుతోన్న నేపథ్యంలో ఇక్కడి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి