2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో బిజెపికి బీటలు వారుతున్నాయా? ఈ విషయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు స్పందించిన తీరు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది. ప్రజా పద్దుల కమిటీ(పిఎసి)కి ఛైర్మన్‌గా ఉన్న మురళీ మనోహన్ జోషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసే సమర్థత కమిటీకి ఉందని పేర్కొనగా, లోక్‌సభలో ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ మాత్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)యే మరింత పదునైందని అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి