ఆఫ్ఘనిస్తాన్‌లో 2010లో ఏడు వందల మంది నాటో సైనికులు మృతి చెందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. తాలిబాన్ తిరుగుబాటుదార్లను అణచివేసే ఉద్దేశంతో దేశంలోకి వేలాది అదనపు సంకీర్ణ దళాలను దించారు. దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికంగా ఈ సంవత్సరం నాటో సైనికులు మృతి చెందారు. అయితే దేశ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదులకు సాంప్రదాయికంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము పురోగతి సాధించినట్లు నాటో, అమెరికా చెబుతున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి