.

14, నవంబర్ 2010, ఆదివారం

మసిబారుతున్న బీడీ కార్మికుల బతుకులు

మసిబారుతున్న బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్న బీడీ కార్మికుల బతుకులు
'బీడీ కట్టలు చుట్టడంలో కష్టం వారిది. కానీ ఆ కష్టార్జితం ద్వారా వచ్చేదాంట్లో కనీస వేతనం కూడా వారికి దక్కట్లేదు. వారి శ్రమ ద్వారా కోట్లు గడిస్తున్న యాజమాన్యాలు వారి డిమాండ్లు నెరవేర్చడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. వేతనాలు సరిపోక, వచ్చేవి కూడా నెలనెలా రాక ఆర్థికపరమైన ఇబ్బందులెన్నో వారు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకోసం అప్పులు చేస్తున్నారు. పిల్లల్ని చదివించుకునే స్థోమత లేక బడి మాన్పిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో చాలామంది కార్మికుల బతుకులు దుర్భరమవుతున్నాయి. అయినా ప్రభుత్వంగానీ, యాజమాన్యంగానీ వారిని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇప్పటికైనా తమకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి