.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

రాత్రి క‌రెంటుకు రైతులు బ‌లి



-  కరీంనగర్‌లో ఏడాదిలో 40 మంది మృతి 
-  కోతలు, షిఫ్టుల్లో మార్పుతో రైతాంగం బెంబేలు
    రవీంద్ర, కరీంనగర్‌ ప్రతినిధి
   గత నెల 25 అర్ధరాత్రి... ధర్మపురి మండలం గంగసముద్రం గ్రామంలో పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు గుండ గంగన్న(52) ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో మృతి చెందారు. గత మే నెలలో జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామంలో పరకాల సమ్మయ్య(55), దేశిని శివకుమార్‌(25) మామా అలుళ్లు ఒకే సంఘటనలో మృతి చెందారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. కరీంనగర్‌ జిల్లాలో గత ఏప్రిల్‌ నుంచి ఇంతవరకు 50 మంది రైతులు రాత్రి విద్యుత్‌కు బలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. లెక్కప్రకారం.. పదిమాసాల్లో 50 మంది అనుకోవడానికి కూడా వీల్లేదు. ప్రధానంగా విద్యుత్‌ కోతలు ఉన్న సమయంలో ఆరుమాసాల్లోనే అంత మంది మృతి చెందారని చెప్పొచ్చు. read more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి