11, ఫిబ్రవరి 2014, మంగళవారం

సందిగ్ధం -సిఎం రాజీనామాపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
 -మంత్రులు, ఎమ్మెల్యేలతో కిరణ్‌ భేటీ
 -వద్దని వారించిన నేతలు
 ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
       ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. రాజీనామాపై కాంగ్రెస్‌ నేతల్లోనే ఉత్కంఠ నెలకొంది. రాజీనామా చేస్తానని సిఎం చెబుతున్నారని, తామైతే వద్దని చెబుతున్నామని, ఏమి చేస్తారనేది కిరణ్‌ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ నెల 13న లేదా 14న రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నా అది కూడా కచ్చితమైన తేదీ కాదని తెలిసింది. బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత సిఎం రాజీనామా చేస్తారని తాజాగా మరో ప్రచారం షికారు చేస్తోంది. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి