10, ఫిబ్రవరి 2014, సోమవారం

తృణమూల్‌ హింసాకాండపై లెఫ్ట్‌ సమరభేరి- ఐక్యతతో కాంగ్రెస్‌, బిజెపిలను ఓడించాలని ప్రకాశ్‌కరత్‌ పిలుపు 
- ల్‌కతా లెఫ్ట్‌ఫ్రంట్‌ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలు
- భారీగా తరలివచ్చిన ప్రజలను అభినందించిన ప్రకాశ్‌కరత్‌
ప్రజాశక్తి ప్రతినిధి-కొల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ ఆధ్వర్యంలో కొల్‌కతా నగరంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కొనసాగిస్తున్న హింసాకాండపై వామపక్ష కార్యకర్తలు సమరభేరి మోగించారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన వామపక్ష కార్యకర్తలతో నగరంలోని బ్రిగేడ్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ అరుణార్ణవమైంది. అసంఖ్యాక జనవాహినితో జనసంద్రంగా మారింది. ర్యాలీకి హాజరయ్యేందుకు నగరానికి చేరుకుంటున్న వామపక్ష కార్యకర్తలను అడ్డుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు తమదైన శైలిలో జులుం ప్రదర్శించారు. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి