10, ఫిబ్రవరి 2014, సోమవారం

రేపే పార్లమెంటుకు..
 - రాష్ట్రపతి చేతికి టిబిల్లు
- ప్రవేశ తేదీలపై స్వల్ప తేడాలు 
- బిజెపి మద్దతుపై భరోసా
- ఆమోదించడానికే ప్రయత్నం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
   ఆంధ్ర ప్రదేశ్‌ విభజన, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పునర్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రం తుది సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కేబినెట్‌ ఆమోదించిన బిల్లు ప్రతిని ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. కొంతమంది చెబుతున్నట్టు ఆయన ఈ విషయంలో ఎలాటి ప్రతిబంధకాలు సృష్టించే అవకాశం లేదు గనక సభలో ప్రవేశపెట్టడానికి పచ్చజెండా వూపుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో పదవ తేదీన ప్రవేశపెడతారని మొదట కథనాలు వచ్చాయి. కేబినెట్‌ ఆమోదం తర్వాత 12వ తేదీ అన్నారు.  see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి