8, ఫిబ్రవరి 2014, శనివారం

12,13 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 48 గంటల దేశవ్యాప్త సమ్మె- పాల్గొననున్న 12 లక్షల మంది 
- సిసిజిఇడబ్ల్యూ పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
డిమాండ్ల సాధన కోసం ఈనెల 12, 13 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు 48 గంటల దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సిసిజిఇడబ్ల్యూ), నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఎఫ్‌పిఇ) నేతలు సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిసిజిఇడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షులు టి నరసింహన్‌, రాష్ట్ర అధ్యక్షులు టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 48 గంటల దేశవ్యాప్త సమ్మెలో 12 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని చెప్పారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి