.

27, డిసెంబర్ 2013, శుక్రవారం

వేడెక్కిన విడిది

  -రాష్ట్రపతికి పోటాపోటీగా వినతులు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 సీమాంధ్ర, తెలంగాణా ప్రాంత నేతల పోటాపోటీ వినతులతో రాష్ట్రపతి శీతాకాల విడిది వేడెక్కుతోంది. శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు రావడం. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేయడం సాంప్ర దాయంగా వస్తున్నప్పటికీ ఆయన పర్యటన సాధారణంగా మీడియాకు దూరంగా ఉండేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా తెలంగాణా సీమాంధ్ర ప్రాంత నేతలు రాష్ట్రపతిని కలవడానికి పోటీ పడుతున్నారు. గురువారం ఒక్కరోజే నాలుగు పార్టీల నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. తమ వాదనలను వినిపించారు. వీరుకాకుండా మర్యాద పూర్వకంగా ఎంపి అజహరుద్దీన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాష్ట్రపతిని కలిశారు. గురువారం ఉదయం వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంఎల్‌ఏలు ఇతర నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. విభజనకు వ్యతిరేకంగా ఎంఎల్‌ఏల సంతకాలతో ఉన్న అఫిడ విట్లను అంద చేశారు. విభజన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ తరువాత కేంద్ర మంత్రి పురందేశ్వరి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న లోపాలను ఆమె రాత పూర్వకంగా రాష్ట్రపతికి అందచేశారు. విభజన తరువాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో న్యాయంread more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి