.

29, డిసెంబర్ 2013, ఆదివారం

పాతబస్తీలో 'కాశ్మీర్‌' దుస్థితి

-పేలుళ్లు ఎక్కడైనా ఇక్కడి యువకులపైనే ఉగ్రముద్ర
- 'పీపుల్స్‌ యూనిటీ అగినెస్ట్‌ కమ్యూనలిజం' సభలో తరిగామి
  -మతోన్మాదంపై ఐక్య ఉద్యమం
 ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
 కేంద్రంలో అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆ పార్టీ జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్‌ తరిగామి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విభజన సమయంలో పెద్దలు చేసిన తప్పులకు కాశ్మీరీలు శిక్షలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీరీల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారిని సైన్యం కాల్చిచంపుతోందని, ఆందోళనలు చేస్తే ఉగ్రవాద ముద్రవేసి ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. అదే పరిస్థితిని ఇక్కడి పాతబస్తీ ప్రజలు ఎదుర్కొంటున్నారనీ దేశంలో ఏ మూల బాంబు పేలుళ్ల జరిగినా ఇక్కడి అమాయక ముస్లిం యువకులపై ఉగ్రముద్ర వేస్తున్నారని తెలిపారు. ఆవాజ్‌ ఆధ్వర్యంలో శనివారం పాతబస్తీలోని చాంద్రాయణ్‌గుట్ట చౌరస్తాలో 'మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఐక్యత' (పీపుల్స్‌ యూనిటీ అగినెస్ట్‌ కమ్యునలిజం' సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మజ్లీస్‌ పార్టీ ఒకవైపు పాతబస్తీని ఏలుతుంటే..అధికారం కోసం బిజెపి, సంఫ్‌ుపరివార్‌ వంటి మతత్వశక్తులు రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇరు మతాల ప్రజల మధ్య చిచ్చు రగిల్చి ఓటు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. 'పేద ప్రజలను బతకనీయండి, వారి హక్కులను లాక్కోకండి, లౌకిక భావాలు గల నేతల్ని ఎన్నుకొండి' అని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్‌, హైదరాబాద్‌లేread more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి