.

3, మార్చి 2011, గురువారం

పట్టణ వ్యర్ధపదార్థాల నిల్వ వినియోగo....

ఎప్పుడైనా మున్సిపల్‌ చెత్త (పట్టణ వ్యర్ధపదార్థాలు) నిల్వ ప్రదేశాన్ని చూశారా? ఎంతో దూరం నుండే దుర్వాసన వస్తుంది. ముక్కు మూసుకొని మాత్రమే దగ్గరకు వెళ్లగలం. అయినా, భరించి వెళ్లిచూస్తే, అంత దుర్వాసనను కూడా భరించి కొంత మంది అభాగ్యులు గుట్టలు, గుట్టలుగా ఉన్న చెత్తనుండి ప్లాస్టిక్‌ కాగితాలు, డబ్బాలు, సీసాలు, ఇనుప ముక్కలు వేరు చేస్తుండటాన్ని గమనిస్తాం. వారి వైపు పూర్తిగా కన్నెత్తి చూడటానికి వెనకాడతాం. ఇక ముసిరే ఈగలు, దోమల్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒకచోట, అక్కడే కాలుతూ, పొగవస్తున్న గుట్టల్ని చూస్తాం. అక్కడ ఎక్కువ సేపు ఉంటే మనకీ ఎక్కడ జబ్బులు వస్తాయోనని త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాం. ఇంత దుర్గంధ, అనారోగ్య పరిస్థితులను భరిస్తూ ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వారిని చూసి జాలిపడతాం. వీరు చాలా పేదవారని ఒకసారి అనుకుంటాం..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి